కర్నూలులో కరోనాతో ప్రముఖ వైద్యుడు మృతి - doctor
famous-doctor-dies-with-corona-in-kurnool
23:06 April 15
కర్నూలులో నిన్న ఒక ప్రముఖ వైద్యుడు(76) మృతి చెందారు. ఆయనకు కరోనా ఉన్నట్లు చనిపోయిన తర్వాత జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. అంతకుముందు వైద్యుడిని చాలా మంది రోగులు సంప్రదించారు. కర్నూలులోనే కాకుండా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి రోగులు వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యుడి వద్ద చికిత్స పొందిన రోగుల్లో ఆందోళన మొదలైంది. ఈనేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు...రోగులను గుర్తించే పనిలో పడ్డారు.
Last Updated : Apr 15, 2020, 11:37 PM IST
TAGGED:
doctor