కర్నూలు పాత నగరంలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. కొండారెడ్డి బురుజు సమీపంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్లోని పార్కింగ్ స్థలంలో నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. రాజకీయ పలుకుబడితో గతంలో 7 భవనాలను నిర్మించారని అధికారులు తెలిపారు. భవనాలకు ఎలాంటి అనుమతులు లేవని వెల్లడించారు. రెండు నెలల క్రితం నోటీసులు ఇచ్చామని...ఎలాంటి అభ్యంతరాలు లేకపోవటంతో ఇవాళ కూల్చేసినట్లు మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.
కర్నూలులో అక్రమ కట్టడాల కూల్చివేత - అక్రమ కట్టడాల కూల్చివేత తాజా వార్తలు
కర్నూలు పాత నగరంలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 7 భవనాలను నేలమట్టం చేశారు.
కర్నూలు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత