ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రక్షణ రాఖీది కాదు... మనసున్న మారాజులది.. - tie

రక్త సంబంధం... ఇది వెల కట్టలేనిది. ఏ చోట ఉన్నా ఒకరికి ఒకరు తోడని తెలిపేది. ఎంత చిల్లరగా కొట్టుకున్న బంధాన్ని మరింత రెట్టింపు చేసేది. అమ్మ ఇచ్చే లడ్డునూ సరిసమానంగా ఎలా పంచుకోవాలో నేర్పేదే అన్న-చెల్లి, అక్క-తమ్ముడి అనుబంధం.

defense-is-not-rakhi

By

Published : Aug 15, 2019, 11:23 AM IST

రక్షణ రాఖీది కాదు... మనసున్న మారాజులది..

తెలిసి తెలియని వయసులో అన్నకు కట్టే రాఖీ విలువ ఎంత తక్కువైనా తను ఇచ్చే చిల్లర పైసల విలువ చెప్పలేనిది. చెల్లి జోలికి ఎవరైనా వస్తే సత్తా లేకపోయినా అడ్డుకోలిగే మొదటి వ్యక్తి తనే. చిన్న చిన్న విషయాల్లో ఏడిపిస్తూ సంతోషించే అల్ప సంతోషి. అమ్మనాన్నలని విసిగిస్తూ చేసే అల్లరిలో తనను కొట్టిన ఫర్వాలేదు చెల్లిని కొట్టింది అని ఆనంద పడే మొదటి వ్యక్తి. గల్లీ క్రికిట్ తెలియకపోయినా ఇంట్లో చెల్లెలికి నేర్పించే కోచ్​. ఏదైనా కొత్త విషయాన్ని నేర్పించడంలో బిల్డప్ కొట్టే గురువు. చిన్నతనంలో మొదటిసారి స్కూలుకి వెళ్లాలంటే తను ఉన్నాడనే ధైర్యం ఇచ్చే భరోసా.

కొంత వయసొచ్చాక అదే బంధం ఒకరినొకరని అర్థం చేసుకునేలా చేస్తుంది. అమ్మ తిడుతుంటే సర్దిచెపుతుంది. పొరుగువారి నుంచి కాపాడుతుంది. అమ్మ, నాన్నల తర్వాత నా అనుకునే మొదటి బంధం అది. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విడిపోయినా వారి అనురాగానికి విలువ తగ్గదు. రోజూ మాట్లాడుకోపోయినా మాట్లాడినరోజు ఏదో తెలియని సంతోషాన్ని ఇస్తుంది. ఏ కష్టం వచ్చిన అన్న/తమ్ముడు ఉన్నాడనే ధైర్యాన్నిస్తుంది.

ఆ ధైర్యం రాఖీ కడితేనే వస్తుందా? లేక ఒకే కడుపున పుడితే వస్తుందా? ఒక తల్లికి పుట్టకపోయిన ఎంతో మంది అన్నలు ఈ సమాజంలో చెల్లెళ్లను కాపాడుతున్నారు. సొంత వారికి రాఖీ కట్టకపోయినా ఎల్లపుడూ నీకు తోడు ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. కొందరు ఆకతాయిలు చేసే పనుల నుంచి ఎవరో తెలియక పోయినా ఆ ఆడకూతురిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్నో అకృత్యాలు జరుగుతున్న నేటి సమాజంలో కాపాడేందుకు మేమున్నామంటున్నారు. రక్త సంబంధీకులు కాకపోయినా ఎక్కడో చోట ప్రపంచ నలుదిక్కుల్లో ఆడవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ప్రతీ ఒక్కరికి ఇవే ఈటీవీ భారత్ చెపుతున్న రక్షా బంధన్ శుభాకాంక్షలు.

ఇవీ చూడండి: రక్షాబంధన్​తో ప్రకృతి బంధం

ABOUT THE AUTHOR

...view details