'విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత భారం మోపారు' - electricity charges latest news in ap
పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేపట్టారు. కష్ట సమయంలో విద్యుత్ బిల్లును పెంచి పేదవారిపై రాష్ట్ర ప్రభుత్వం మరింత భారం మోపిందని సీపీఎం నేత పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
!['విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత భారం మోపారు' పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ సీపీఎం ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7396083-702-7396083-1590760568866.jpg)
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ సీపీఎం ధర్నా
విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కర్నూలులో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఎం నేత పుల్లారెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. కరోనా కష్ట సమయంలో కరెంట్ బిల్లులను పెంచి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై మరింత భారం మోపిందంటూ పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పెంచిన ఇంటిపన్నులు, విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.