కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని... సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. నగరంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా... కర్నూలులో అలాంటివి కనిపించడంలేదని పేర్కొన్నారు. నగరంలో పందుల సంచారం ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని చెత్తను తొలగించి, పందుల సంచారం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.
'నగరంలో పందుల సంచారం ఎక్కువగా ఉంది' - cpm district secretary about kurnool city
కర్నూలు నగరంలో పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉందని... సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడ చూసినా పందులు సంచారం ఉందని చెప్పారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా... కర్నూలులో అధికారులు మాత్రం అలసత్వం చూపుతున్నారని ఆరోపించారు.
కర్నూలు పారిశుద్ధ్యంపై మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి