గత ప్రభుత్వ హయంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. కర్నూలులో పర్యటించిన ఆయన... రింగ్ రోడ్డు వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తైనా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకపోవడాన్ని తప్పుబట్టారు.
ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వం చేపట్టిందనే సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ... ఇళ్లను కేటాయించడంలేదని రామకృష్ణ ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి, వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం త్వరగా చేపట్టాలని ఆయన కోరారు.