కర్నూలులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కరోనా చికిత్స చేస్తున్న ఆసుపత్రుల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని వనమాలి ఆసుపత్రిలో అనుమతి లేకున్నా.. కొవిడ్ బాధితులకు చికిత్స చెయ్యడంతో పాటు రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఆసుపత్రి ఎండీ రాఘవేంద్రను అరెస్టు చేశారు. రెండవ పట్టణ పరిధిలోని మరో ఘటనలో రెమ్డిసివర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.
అనుమతులు లేకున్నా కొవిడ్ వైద్యం.. ఆసుపత్రి ఎండీ అరెస్ట్ - hospital md arrest in karnulu news
ప్రభుత్వ అనుమతి లేకున్నా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రి ఎండీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో కేసులో.. రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు.
![అనుమతులు లేకున్నా కొవిడ్ వైద్యం.. ఆసుపత్రి ఎండీ అరెస్ట్ hospital md arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11606837-59-11606837-1619881880043.jpg)
కర్నూలులో ఆసుపత్రి ఎండీ అరెస్ట్