రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో... కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 82 పాజిటివ్ కేసులు రాగా... ఇందులో 40 కేసులు కర్నూలులోనే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 332 మందికి కోరనా వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నుంచి కోలుకుని శాంతిరాం ఆసుపత్రి నుంచి 11 మంది, కర్నూలు సర్వజన వైద్యశాల నుంచి ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 43 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో 9 మంది మృత్యువాతపడ్డారు. మిగిలిన 280 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఒక్క కర్నూలు జిల్లాలోనే 332 కరోనా కేసులు - kurnool corona cases latest
కర్నూలు జిల్లాలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ రాగా... అందులో 40 కేసులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. కర్నూలు వాసులను ఇది మరింత భయపెడుతోంది.
corona cases in kurnool