కరోనాను జయించటానికి లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని... కేవలం 300 రూపాయలు ఉంటే చాలని అంటున్నారు రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. సాధారణంగా మెడికల్ దుకాణాల్లో లభ్యమయ్యే మందులతోనే కొవిడ్‌ను జయించవచ్చని స్పష్టం చేశారు. సీటీ స్కాన్ల కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు పెట్టవద్దని చెప్పారు. కరోనా చికిత్సకు సంబంధించిన అంశాలను ఆయన 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
ప్రశ్న: మీరు 300 రూపాయలతోనే కరోనా వైద్యం అని చెబుతున్నారు. 300 రూపాయలతో కరోనా వైద్యం అంటే ఏమిటి?
జవాబు : 300 రూపాయలతో కరోనా వైద్యం అనేది కొత్తగా చెప్పడం లేదు. మలేరియా వస్తే క్లోరోక్విన్ తీసుకోండి అని గోడలపై రాసేవారు. ఈ మందులు కూడా అలా
చెప్పడం లాటిందే. 300 రూపాయల వైద్యంలో ఎనిమిది రకాల మందులు ఉంటాయి. జ్వరం వస్తే పారాసిటమాల్, దగ్గు మందు, విటమిన్, మెగ్నీషియం మాత్రలు, కడుపు మంట కోసం పాంటాప్ మాత్రలు ఉన్నాయి. ఒక్క స్టెరాయిడ్ ఉంది. వీటిని వాడటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఇందులో ఉండే స్టెరాయిడ్స్ తక్కువ డోసులో తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. కొవిడ్ కేర్ సెంటర్‌కు వెళ్లినా ఇవే మందులు ఇస్తారు.
- ఈ మాత్రలు ఎలాంటి వారు? ఎప్పుడు వేసుకోవాలి?
చిన్న పిల్లలు మినహా అందరూ వేసుకోవచ్చు. ఏమీ భయపడవద్దు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే ఈ మందులు వాడండి. స్వాబ్ టెస్టు చేయించండి. ఫలితం ఆలస్యమైనా భయపడవద్దు. మీకు వైద్యం జరగుతూ ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులకు పెరిగెత్తవద్దు. 93 శాతం కంటే ఆక్సిజన్ శ్యాచురేషన్ తగ్గితే ప్రభుత్వాసుపత్రిలో చేరండి. పడకలు చాలా ఖాళీగా ఉన్నాయి. 300 రూపాయల మందులు వాడితే 90 శాతం మందికి ఆసుపత్రికి వెళ్లే అవసరమే లేదు.
- ఎలాంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందులు వాడాలి?