Contractor Suicide Attempt For Pending Bills: గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన నాగరాజు అటవీశాఖలో చెట్లకు నీరు పోసిన బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చెయలేదు. అప్పులు తెచ్చి పనులు చేయడంతో వడ్డీలు కట్టలేక రుణభారం పెరిగింది. దీంతో కలత చెందిన నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. నాగరాజు ముసలిమడుగు గ్రామం నుంచి సంగమేశ్వరం వరకు చెట్లకు నీరుపోశారని ఈ బిల్లులు రాక అప్పచెల్లించలేక ఆత్మహత్య యత్నం చేశారని నాగరాజు కుటుంబ సభ్యులు తెలిపారు.
Contractor Suicide Attempt: మంజూరు కాని ప్రభుత్వ బిల్లులు.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం - ముసలి మడుగులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Contractor Suicide Attempt For Pending Bills: ఓ వైపు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ మంజూరు కాలేదు. మరోవైపు పెరిగిపోయిన అప్పుల భారం..దీంతో మనస్తాపం చెందిన ఓ కాంట్రాక్టర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ముసలి మడుగులో చోటు చేసుకుంది.
మంజూరు కాని ప్రభుత్వ బిల్లులు...కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం