Worst Tax Issue: కర్నూలులోని అనంతా కాంప్లెక్స్ ముందు చెత్త పన్ను కట్టలేదని చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ బాలాజీని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కోరారు. నగరపాలక సర్వసభ్య సమావేశంలో నేతల మధ్య చెత్త పన్ను అంశంపై వాగ్వాదం చోటు చేసుకుంది. చెత్త పన్ను రద్దు చేయాలని సీపీఎం నేతలు అధికార ఎమ్మెల్యేలను, మేయర్‌ను నగరపాలక సంస్థ భవనం ముందు అడ్డుకునేందుకు యత్నించిన వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
కొద్దిసేపటి తర్వాత ప్రారంభమైన సమావేశంలో చెత్త పన్ను వసూలులో అధికారుల తీరుపై వైకాపా కార్పోరేటర్లు మండిపడ్డారు. పన్ను కట్టడం లేదని కోళాయి కనెక్షన్లు తొలగిస్తున్న అధికారుల తీరును కమిషనర్ బాలాజీ దృష్టికి వైకాపా నాయకులు తీసుకువచ్చారు. ప్రజలపై భారం పడకుండా వీలైనంత చెత్త పన్ను తగ్గించాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు.