కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. కనుమ పండుగ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ జ్వాలా నరసింహ మూర్తి స్వాములిద్దరూ కలిసి కల్యాణోత్సవానికి భక్తులను ఆహ్వానించేందుకు పార్వేట ఉత్సవం పేరిట గ్రామాల పర్యటనకు వెళ్లారు. 41 రోజుల పాటు స్వామి వారు వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇలా పర్యటన పూర్తి చేసుకొని స్వామి వారు అహోబిలం చేరుకోగానే భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాల నడమ ఆలయానికి చేరుకున్న స్వామికి అర్చకులు నవ కలశాభిషేకం నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలతో స్వామివార్ల బడలికను తీర్చారు. ఈ నెల 28వ తేదీ నుంచి 12 రోజుల పాటు అహోబిలంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
అహోబిల క్షేత్రంలో ముగిసిన పార్వేట ఉత్సవాలు - ahobilam festival latest updates
అహోబిల క్షేత్రంలో కనుమ నుంచి ప్రారంభమైన పార్వేట ఉత్సవం మంగళవారం స్వామి వారి రాకతో ముగిసింది. స్వామి వారు అహోబిలం చేరుకోగానే మేళతాళాలతో భక్తులు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆయనకు నవ కలశాభిషేకం నిర్వహించారు.
అహోబిలంలో ముగిసిన పార్వేట ఉత్సవాలు