ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారత్ బంద్​కు సీఎం జగన్ మద్దతు తెలపాలి: సీపీఎం - kurnool latest news

రైతులకు నష్టం కలిగించే నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్​కు మద్దతు ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ కోరారు. సీఎం జగన్ కూడా రైతులకు మద్దతుగా స్వరం వినిపించాలని డిమాండ్ చేశారు.

cpm leader gafoor
cpm leader gafoor

By

Published : Dec 6, 2020, 5:42 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 8న రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్​కు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ తెలిపారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ బంద్​కు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలిపారన్న ఆయన... సీఎం జగన్ కూడా రైతులకు మద్దతుగా స్వరం వినిపించాలని డిమాండ్ చేశారు.

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కూడా బయటకు రావాలని గఫూర్ అన్నారు. రైతులకు నష్టం కలిగించే నూతన చట్టాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలూ బంద్​కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు బంద్​కు రైతు సంఘాలిచ్చిన పిలుపునకు మద్దతుగా విజయనగరం కోట జంక్షన్ నుంచి కార్మిక, ఉద్యోగ, వామపక్ష సంఘాల నాయకులు రాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details