కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. సలాం అత్త మాబున్నీసా, ఆమె కుమారుడు శంషావలి, కూతురు సాజీదాను పరామర్శించారు. తన కుమార్తె సాజీదాకు ఉద్యోగం ఇవ్వాలని మాబున్నీసా సీఎంను కోరారు. వైద్యశాఖలో పనిచేస్తున్న తన అల్లుడిని నంద్యాలకు బదిలీ చేయాలన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని సీఎంను కోరారు.
సలాం కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్ - కర్నూలు జిల్లా వార్తలు
సీఎం జగన్
15:29 November 20
పరామర్శ
ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సలాం కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మాబున్నీసా కుమార్తెకు ఔట్‌సోర్సింగ్ కింద ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అల్లుడిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీకి చర్యలు తీసుకోవాలన్నారు. శంషావలిని నంద్యాల వైద్యశాఖకు బదిలీ చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి :పాడి పశువుల పంపిణీకి రూ.5386 కోట్లు కేటాయింపు
Last Updated : Nov 20, 2020, 10:20 PM IST