భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు దిగారు. ఇసుక రేట్లు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇసుక సమస్యతో తాము ఉపాధి కోల్పోతున్నామని... ముఖ్యమంత్రి జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని అన్నారు.
కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే... ప్రజా ప్రతినిదులతో పాటు ముఖ్యమంత్రినైనా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.