హోసూరులో మహిళలపై లాఠీఛార్జిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. మొహర్రం సందర్భంగా కర్నూలులో ఉద్రిక్తతలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లాఠీఛార్జి సందర్భంగా ప్రజలే తిరగబడి పోలీసు వాహనాలు దగ్దం చేసే పరిస్థితి వచ్చిందని... రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని... పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు అప్రమత్త చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.
మహిళలపై లాఠీఛార్జ్ బాధాకరం:చంద్రబాబు - hosoor
కర్నూలు జిల్లా హోసూరులో మహిళలపై జరిగిన దాడులపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో మొహర్రం సందర్భంగా లాఠిఛార్జి చేయటం దారుణమన్నారు.
మహిళలపై లాఠిఛార్జ్ను ఖండించిన తెదేపా అధ్యక్షుడు