ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Canara Bank Cheating: కెనరా బ్యాంకు అధికారుల మోసం...రుణాలిచ్చి బురిడి కొట్టించారు -బాధితులు - శ్రీశైలం కెనరా బ్యాంకు మేనేజర్ మోసం

Canara bank Cheating: పూచీకత్తు లేకుండా రుణాలిప్పించారు. తీరా చూస్తే రుణంలో సగం సొమ్ము కాజేశారు. తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించమంటే ముఖం చాటేశారు. ఇదంతా చేసింది దళారులో, మరెవరో కాదు...స్వయానా బ్యాంకు సిబ్బందే. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని కెనరా బ్యాంకు అధికారుల తీరిది..

Canara Bank Cheating:
Canara Bank Cheating:

By

Published : Mar 16, 2022, 5:25 PM IST

Canara bank Cheating: రుణాలు ఇప్పిస్తామని చెప్పి కర్నూలు జిల్లా శ్రీశైలంలోని కెనరా బ్యాంకు అధికారులు తమని మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఆటో నడుపుకునేందుకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి...పూచీకత్తు లేకుండానే రుణాలు ఇప్పించి..బురుడి కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రుణాలు, సబ్సిడీ రుణాలు కూడా ఇస్తున్నామని బుకాయించి..అడిగిన మొత్తం కంటే ఎక్కువే ఇస్తామని మభ్య పెట్టారని వివరించారు.

కెనరా బ్యాంకు అధికారుల మోసం...రుణాలిచ్చి బురిడి కొట్టించారు -బాధితులు

కెనరా బ్యాంకులో...ఆ బ్యాంకు సిబ్బంది తమకు రుణాలు మంజూరు చేశారని, ఆ రుణంలో సగం సొమ్ము బ్యాంకు సిబ్బంది కాజేసినట్లు బాధితులు వాపోతున్నారు. తీరా దానిని కట్టమంటే కట్టట్లేదని గోడు వెళ్లపోసుకున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేసి రుణాన్ని పూర్తిగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :సభలో చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details