ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిమెంట్, స్టీలు ధరల పెరుగుదలపై బిల్డర్స్ అసోసియేషన్ ఆందోళన - కర్నూలులో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుల నిరసనలు

ఇసుక లభ్యత, సిమెంట్ స్టీలు ధరల పెరుగుదలపై.. బిల్డర్స్​ అసోసియేషన్ ఆఫి ఇండియా నాయకులు కర్నూలులో నిరసనకు దిగారు. ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు కావాలనే ధరలు పెంచుతున్నారని.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

builders association protests in kurnool
సిమెంట్, స్టీలు ధరల పెరుగుదలపై బిల్డర్స్ అసోసియేషన్ కర్నూలులో ఆందోళన

By

Published : Feb 12, 2021, 6:08 PM IST

పెరిగిన ధరలతో భవన నిర్మాణ రంగం తీవ్ర నష్టాలకు గురవుతోందంటూ.. కర్నూలులో బిల్డర్లు ఆందోళన చేపట్టారు. సిమెంట్, స్టీలు ఉత్పత్తి దారులు కృత్రిమంగా ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వారిని నియంత్రించాలని కోరారు.

రాష్ట్రంలో ఇసుక దొరకడంలేదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాయకులు ఆరోపించారు. లబ్ధిదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details