'కరోనా ల్యాబ్ ఎందుకు పెట్టలేదు' - corona positive cases news in kurnool district
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నివారణ చర్యలు తీసుకోవడంలేదని భాజపా నేత విష్టువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటిల్ కేసులు ఉన్న కర్నూలు జిల్లాలో ఎందుకు ఇంతవరకూ కరోనా నిర్థరణ ల్యాబ్ ఏర్పాటు చెయ్యలేదని ఆయన నిలదీశారు.
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నివారణ చర్యలు తీసుకోవడంలేదని భాజపా నేత విష్టువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. మార్చి 22 నుంచి జిల్లాలో లాక్డౌన్ అమలులో ఉన్నా కేసులు ఎందుకు పెరుగుతున్నాయన్నారు. కర్నూలు ప్రజలు భయాందోళనకు గురువుతుంటే వైకాపా నాయకులు మాత్రం రాజకీయలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సమయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడ ఉన్నారన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటిల్ కేసులు ఉన్న కర్నూలు జిల్లాలో ఎందుకు ఇంతవరకు కరోనాకు సంబంధించిన ల్యాబ్ ఏర్పాటు చెయ్యలేదని ఆయన నిలదీశారు.