ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పట్లోనే 2వేల పింఛన్ ఇచ్చారు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం - ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని ప్రశ్నించిన మహిళ

MLA Sai Prasad Reddy: కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి ఓ వృద్ధురాలు షాక్‌ ఇచ్చింది. గడప గడపకు కార్యక్రమంలో పింఛన్‌ సరిపోవడం లేదని ఎమ్మెల్యేను... చిన్నిబాయి అనే వృద్ధురాలు మొరపెట్టుకుంది. తెదేపా కంటే వైకాపా హయాంలోనే ఎక్కువ పింఛన్​ ఇస్తున్నామని అన్నారు. ఏ మాత్రం తడుముకోని మహిళ.. చంద్రబాబు ఉన్నప్పుడే 2వేలు పింఛన్‌ ఇచ్చారని.. ఎమ్మెల్యేతో చెప్పగా..దీంతో, సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

MLA Sai Prasad Reddy
గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేకు వృద్ధురాలు షాక్​

By

Published : Oct 7, 2022, 5:00 PM IST

Updated : Oct 7, 2022, 7:57 PM IST

MLA Sai Prasad Reddy: కర్నూలు జిల్లా ఆదోనిలో 'గడప గడప' కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్​రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని 1వ వార్డులో ఓ వృద్ధురాలికి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సరిపోవడం లేదని చిన్ని భాయ్ అనే వృద్ధురాలు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఏ మాత్రం తడుముకోని మహిళ.. చంద్రబాబు ఉన్నప్పుడే 2వేలు పింఛన్‌ ఇచ్చారని.. ఎమ్మెల్యేకు తెలిపింది. ఇదే సమయంలో ఎల్​కేజీ విద్యార్థి తన్విష్ లాప్ టాప్ ఎప్పుడీస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. నవ్వుతూ నీవు పెద్దగా అవ్వు ... అప్పుడు ఇస్తానని ఎమ్మెల్యే చెప్పి వెళ్లిపోయాడు.

గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేకు వృద్ధురాలు షాక్​
Last Updated : Oct 7, 2022, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details