ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపాలోకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి? - mla

కాంగ్రెస్ పార్టీకీ ఇటీవలే రాజీనామా చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెదేపాలోకి చేరనున్నారు. శ్రీశైలం అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్న ఈయన... అధిష్ఠానం హామీ ఇస్తే పార్టీ కండువా కప్పుకోనున్నారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

By

Published : Mar 19, 2019, 5:09 PM IST

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే,సీనియర్ నేత... బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు.తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో... బైరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా శ్రీశైలం ఎమ్మెల్యేఅభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డిఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనివల్ల శ్రీశైలం నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్​తనకు ఇవ్వాలని బైరెడ్డి పట్టుబడుతున్నారు. సీఎం పచ్చజెండా ఊపితే... బైరెడ్డి తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details