తెదేపా నేత తిక్కారెడ్డిపై వైకాపా నేతలు దాడి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు ప్రచారసభలో హెచ్చరించారు.
చంద్రబాబు
By
Published : Mar 19, 2019, 3:49 PM IST
కర్నూలు ప్రచార సభలో సీఎం
కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైకాపా నేతలు దాడి చేయడాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా పోటీ ఉండాలే తప్ప..దాడులు చేయవద్దని హితవు పలికారు. తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై దాడి చేస్తే ఖబడ్దార్ అని కర్నూలు సభలో హెచ్చరించారు. జగన్ని చూసి వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని.... రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తా అని తేల్చి చెప్పారు.