కరోనా ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు నష్టాల పాలవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు మూతపడ్డాయి. పండిన పంటను ఏం చేసుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు. లాక్‌డౌన్ కారణంగా కర్నూలు జిల్లా అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి లోడ్‌లతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిన లారీలను సరిహద్దుల్లోనే వెనక్కి పంపుతున్నారు. పంటను విక్రయించేందుకు తంటాలు పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్లు మూతపడ్డాయి. రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరికి డిమాండ్ ఉండే ఈ సమయంలో మార్కెట్లు లేకపోవడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్: అన్నదాతలకు అపార నష్టం
లాక్‌డౌన్ కారణంగా రైతులు తీవ్ర నష్టాలపాలవుతున్నారు. మార్కెట్లు మూసివేసిన కారణంగా పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. చేతికొచ్చిన పంట ఏం చేసుకోవాలో తెలియని దుస్థితిలో రైతన్నలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు లోడ్‌లతో వెళ్లిన లారీలను వెనక్కిపంపుతున్నారు.
banana-farmers-loss-for-lock-down