ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంత్యక్రియలకు వెళ్తూ... అనంత లోకాలకు - accident news in karnool district

బంధువు చివరి చూపునకు పయనమైన ఆ కుటుంబంలో చీకటి అలుముకుంది. అంతిమయాత్రకు వెళ్లాలని బయలుదేరితే... ఆ కుటుంబంలోని వ్యక్తి అనంత లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కురూ సమీపంలో చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడి బైన్‌దొడ్డి గ్రామానికి చెందిన గిడ్డయ్య మృతిచెందాడు. ఆరుగురికి గాయాలయ్యాయి.

auto accident at kodumuru
కోడుమూరులో ఆటో బోల్తా

By

Published : Mar 19, 2020, 2:24 PM IST

కోడుమూరులో ఆటో బోల్తా

అంత్యక్రియలకు వెళ్తుండగా జరిగిన ఆటో ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కురూ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. కోడుమూరు మండలం బైన్‌దొడ్డి గ్రామానికి చెందిన గిడ్డయ్య తనకుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెల్దుర్తి మండలం బోయినపల్లిలో అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గిడ్డయ్య మరణించారు. తీవ్రగాయాలైన ఎర్రక్క, మాదేవిలను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కోడుమూరు ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details