కర్నూలు జిల్లా నంద్యాల చిత్రకారుడు చింతలపల్లి కోటేశ్వరరావు(కోటేష్)కు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులో చోటు లభించింది. ర్యాడ్ ఆర్ట్ సంస్థ అధినేత మయానక్ వ్యాస్(ఇండియా), అమెరికాకు చెందిన మహిమా గుప్తా ఆధ్వర్యంలో కేవలం ఒక గంటలో నిర్వహించిన స్పాట్ కాన్వాస్ పెయింటింగ్ పోటీల్లో 'మత్స్య అవతారం' చిత్రాన్ని గీసి కోటేష్ ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది మే రెండో తేదీన ఆన్లైన్లో నిర్వహించిన ఈ పోటీల్లో 112 దేశాలకు చెందిన 1149 మంది చిత్రకారులు పాల్గొన్నారు.
వారిలో 797 మంది చిత్రకారులు ఒక గంటలో చిత్రాన్ని వేశారు. అందులో నంద్యాలకు చెందిన కొటేష్ ఒకరు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. కొటేష్ చిత్రించిన మత్స్య అవతార చిత్రాన్ని ఎంపిక చేశారు. ఇదే.. ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి పెట్టింది. ఈ ఘనతపై కోటేశ్ హర్షం వ్యక్తం చేశారు.