సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఉద్యోగుల ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి అన్నారు. తెదేపా నాయకులు ఉద్యోగులను రాజీనామా చేయమని చెప్పారని.. ఉద్యోగులు రాజీనామా చేస్తే తెదేపా కార్యకర్తలతో ఎన్నికలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సానుకూలంగా ఉన్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
'ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోంది' - ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్
ఎన్నికల సంఘం అధికారులపై, ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపుగా చర్యలు తీసుకుంటోందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితాను సవరించకుండా హడావుడిగా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముందని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
'ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోంది'