ACB raids in Kurnool municipal corporation: కర్నూలు నగరపాలక సంస్థలో అవినీతి నిరోధక శాఖకు భారీ తిమింగలం చిక్కింది. సూపరింటెండెంట్ ఇంజనీరు సురేంద్రబాబు ఏకంగా రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. అమృత్ పథకంలో భాగంగా 2016 నుంచి 15 లక్షల ఇళ్లకు గుత్తేదారు శ్రీనివాసరెడ్డి కుళాయిలు సరఫరా చేశారు. దీనికి సంబంధించిన బిల్లులు మంజూరు చేసేందుకు సురేంద్రబాబు రూ. 15 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో గుత్తేదారు అనిశాను ఆశ్రయించారు. కృష్ణానగర్ వంతెన వద్ద శ్రీనివాసరెడ్డి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నగరపాలిక కార్యాలయంలోని సురేంద్రబాబు ఛాంబర్‌లోనూ తనిఖీలు నిర్వహించారు.
ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్ ఇంజినీరు - ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్ ఇంజినీరు సురేంద్రబాబు
కర్నూలు నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీరు సురేంద్రబాబు.. రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు. స్థానికంగా గుత్తేదారుకు బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో గుత్తేదారు అనిశాను ఆశ్రయించారు.
acb ride at Kurnool