కరోనా కాలంలో మానవత్వాన్ని చాటుకుంటున్నారు కర్నూలుకు చెందిన యువకులు. వైరస్‌తో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
ఆఖరి మజిలీలో 'ఆ నలుగురు'
చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉన్న పేద కుటుంబాలకు సాయం చేస్తున్నారు ఆ యువకులు. ఎవరైనా చనిపోతే వారి మత సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు చేస్తున్నారు. ఇప్పటికి 71 మందికి అంత్యక్రియలు చేశారు.
kurnool
ఎస్.డి.పి.ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొందరు యువకులు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. తమకు అధికారులు సైతం మద్దతు ఇస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా చనిపోతే వారి మత సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు చేస్తున్నామన్నారు. ఇప్పటికి తాము 71 మందికి అంత్యక్రియలు చేశామని తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉన్న వారు తమకు సమాచారం ఇస్తే సాయం చేస్తామని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి జహంగీర్ తెలిపారు.