కర్నూలు నగరంలో కరోనా విస్తరిస్తుండటంతో ఓ రైతుకు వినూత్న ఆలోచన వచ్చింది. గడ్డి కోసం వెళ్లేటప్పుడు ఎద్దుకు విధిగా మాస్కును కడుతున్నాడు. జంతువులకు కూడా కరోనా వస్తుందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రైతు... తన ఎద్దును రక్షించుకోవటానికి దాని మూతికి గుడ్డను కడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పశువుపై ప్రేమ చూపుతున్న ఆ రైతుతో ముఖాముఖి....
ఎద్దుకు మాస్కు తొడిగి.. అందరికీ ఆదర్శంగా నిలిచాడు..! - కర్నూలులో ఎద్దుకు మాస్కు
కరోనా విజృంభిస్తున్నందున మాస్కు లేకుండా బయటకు రావొద్దని ప్రజలకు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా కొందరు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కర్నూలుకు చెందిన ఓ రైతు మాత్రం బయటకు వచ్చేప్పుడు విధిగా తాను మాస్కు ధరించడమే కాకుండా ఎద్దుకు సైతం ఓ గుడ్డ కడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
A farmer tied mask to his bull in kurnool city