రైతులు సాధారణంగా ఎద్దులతో వ్యవసాయం చేస్తారు. మరికొంత మంది ఆవులను, గేదెలను వినియోగిస్తుంటారు. వినూత్నంగా గుర్రంతో సాగు పనులు చేస్తున్నారు కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని చిన్న నగరికి చెందిన కృష్ణమూర్తి. తనకున్న మూడు ఎకరాల్లో ఆముదం పంట సాగు చేశారు. ఎద్దులు లేకపోవటంతో పెంచుకున్న గుర్రంతోనే కలుపు నివారణ కోసం ఆయన గుంటక తోలారు. దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
గుర్రంతో పొలం దున్నిన రైతు..! - కర్నూలు జిల్లాలో గుర్రంతో వ్యవసాయం
ప్రస్తుతం సాంకేతికత మరింతగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. చాలా మంది యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు. స్థోమత లేనివారు ఎప్పటిలాగే ఎద్దులతో పొలాన్ని దున్నుతారు.. కానీ ఓ రైతు మాత్రం సరికొత్తగా గుర్రంతో భూమిని దున్నతున్నాడు.
![గుర్రంతో పొలం దున్నిన రైతు..! horse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15714121-322-15714121-1656727640695.jpg)
గుర్రంతో సాగు