- విమానాశ్రయం ప్రారంభం
కర్నూలు విమానాశ్రయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు కొనసాగుతాయని సీఎం జగన్ తెలిపారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రజారాజధానిపై పగబట్టారని సాక్ష్యాధారాలతో వెల్లడైంది: తెదేపా
సీఎం జగన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిజస్వరూపం బటయపడిందన్నారు. వీరు సీఐడీని, కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వంగపండు కుటుంబానికి ఆర్థిక సాయం
ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వంగపండు వారసులకు ఈ మొత్తాన్ని చెల్లించాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనా కలవరం
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ.. వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 758 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ టీకా తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎన్నికల్లో నేతల సిత్రాలు చూడతరమా!
కూటి కోసం కోటి పాట్లు అన్న సామెతకు చెక్ పెడుతూ.. ఓటు కోసం కోటి పాట్లు పడుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. కొందరు ఓటర్లను ఆకర్షించేందుకు విభిన్నంగా ఆలోచిస్తూ.. ముందుకు సాగుతున్నారు. బట్టలు ఉతకడం దగ్గరి నుంచి పిల్లలకు స్నానాలు చేయించటం వరకు అన్ని పనులు చేస్తూ మాలో ఒకరన్న భావనను ప్రజలకు కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఎన్నికల సంఘం విధుల్లో భాజపా జోక్యం'