కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలోని ఓ మురుగు గుంతలో పడి ముర్తుజావలి అలియాస్ మున్నా (4) మృతి చెందాడు.షేక్ హుస్సేన్. రేష్మా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో మున్నా మొదటి సంతానం. శుక్రవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుతూ కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు రాత్రి వరకు గాలించినా జాడ తెలియలేదు. శనివారం మధ్యాహ్నం కాలనీ సమీపంలోని ఓ గృహ సముదాయ కాలనీకి చెందిన మురుగు గుంతలో శవమై కనిపించాడు. ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఘటనతో హుస్సేన్ దంపతులు తల్లడిల్లిపోయారు. ఓ వెంచర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా గుంత తీసి వదిలేయటంతోనే తమ కుమారుడు చనిపోయారని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మురుగు గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి - కర్నూలు పట్టణం తాజా మరణం వార్తలు
ప్రమాదవశాత్తు ఓ మురుగు గుంతలో పడి నాలుగు ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. కాలనీ సమీపంలోని ఓ గృహ సముదాయ కాలనీకి చెందిన మురుగు గుంతలో శవమై కనిపించాడు. సమాచారం తెలుసుకున్న నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.
మురుగు గుంతను పరిశీలిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని