ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Food Poison: పానీ పూరి తిన్నారు...ఆసుపత్రి పాలయ్యారు.. - ఆదోనిలో పానీపూరీ తిని వాంతులు విరేచనాలు

Food Poison : కర్నూలు జిల్లా ఆదోనిలో పానీ పూరి తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతూ ఆదోని ఏరియా ఆసుపత్రిలో చేరారు.

Food Poison
Food Poison

By

Published : Apr 3, 2022, 9:41 AM IST

Food Poison : కర్నూలు జిల్లా ఆదోనిలో పానీ పూరి తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు.వారంతా వాంతులు,విరేచనాలతో ఇబ్బందిపడుతూ ఆదోని ఏరియా ఆసుపత్రిలో చేరారు.బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని మండిగిరి ప్రాంతంలో పానీ పూరి తిన్నామని తెలిపారు. రాత్రి చాలాసేపు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డామని, రెండు గంటల సమయంలో ఆసుపత్రిలో చేరినట్లు బాధితులు తెలిపారు.

కలుషిత ఆహారం తిన్న బాధితులు వాంతులతో ఇబ్బంది పడుతూ అర్థరాత్రి సమయంలో ఆసుపత్రిలో చేరారని..ప్రస్తుతం అందరూ చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి :కొవ్వాడలో వ్యక్తి దారుణహత్య.. నాటు తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details