ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రేమించలేదని ప్రాణం తీశాడు... అసలేం జరిగిందంటే..? - కాకినాడ జిల్లా తాజా వార్తలు

murder
యువతిపై ప్రేమోన్మాది దాడి

By

Published : Oct 8, 2022, 1:26 PM IST

Updated : Oct 8, 2022, 7:45 PM IST

13:22 October 08

యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

యువతిపై ప్రేమోన్మాది దాడి

కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదంటూ ఓ యువతిని ప్రేమోన్మాది దారుణంగా హత్య చేశాడు. దారికాచి యువతిని అటకాయించిన నిందితుడు.. కత్తితో గొంతు కోసి చంపేశాడు. ప్రేమించడం లేదన్న కారణంతో ఓ ఉన్మాది.. యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లాలో కలకలం రేపింది. 21 ఏళ్ల యువతి దేవిక.. కరప నుంచి కూరాడకు బైక్‌పై వెళ్తుండగా..పెదపూడి మండలం కాండ్రేగుల వద్ద ఉన్మాది వెంకట సూర్యనారాయణ అడ్డగించి కత్తితో దాడిచేశాడు. నడిరోడ్డుపై గొంతు కోశాడు. స్థానికులు అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. అది వచ్చేలోపే యువతి ప్రాణాలు వదిలింది. నిందితుడు వెంకట సూర్యనారాయణను స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి..కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.

దేవిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటుండగా..ఆమె కరప మండలం కూరాడలో అమ్మమ్మ వద్ద ఉంటోంది. నిందితుడు సూర్యనారాయణది తూర్పు గోదావరి జిల్లా బాలవరం కాగా.. కూరాడలోని మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. దేవికను గత ఏడాదిగా నిందితుడు వెంకట సూర్యనారాయణ.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనిపై యువతి బంధువులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. గ్రామ పెద్దలు మందలించడంతో.. నిందితుడు వెంకట సూర్యనారాయణ కూరాడ వదిలి హైదరాబాద్‌ వెళ్లి కొంత కాలంగా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి కూరాడ తిరిగివచ్చి..ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పెదపూడి పోలీసులు.. ఘటనపై విచారణ చేపట్టారు. యువతి మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2022, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details