అన్నదాత సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... వారి ఆత్మహత్యలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక మరో ఇద్దరు కౌలు రైతులు బలయ్యారు. కాకినాడు జిల్లాలో ఒకరు మరణించగా.. పల్నాడు జిల్లాలో మరో రైతు మృతి చెందాడు.
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడ గ్రామానికి చెందిన వేమగిరి నాగేశ్వరరావు(37).. 4.80ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయంతో పాటు ఇంటి నిర్మాణం కోసం కొంత అప్పులు చేశాడు. ఆ అప్పులు వడ్డీతో కలిసి రూ.10లక్షలు దాటాయి. సాగులో నష్టాలు రావడంతో అప్పులు తీరే మార్గం కనిపించక.. ఈనెల 14వ తేదీన ఇంటి వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నంచేశాడు. గమనించిన కుటుంబ సభ్యలు చికిత్స నిమిత్తం తొలుత పిఠాపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగేశ్వరావు మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.