ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కార్పొరేట్​ రంగాలకు అనుకూలంగా లేబర్​కోడ్​లు' - east godavari latest news

మేడే సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప, కాకినాడలోని పలు గ్రామాల్లో అరుణ పతాకాన్ని కార్మిక సంఘాన నాయకులు ఆవిష్కరించారు. కేంద్రం కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చేశారని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. మేడే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు.

may day celebrations at kakinada rural constituency
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మేడే వేడుకలు

By

Published : May 1, 2021, 10:37 PM IST

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప, కాకినాడలోని పలు గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా.. అరుణ పతాకావిష్కరణలు జరిగాయి. రమణయ్యపేట గ్రామ పంచాయతీ కార్యాలయం, వలసపాకల సెంటర్, వాకలపూడి గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సీనియర్ వర్కర్స్, సీఐటీయూ నాయకులు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రస్తుతం కరోనా సమయంలో కూడా సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, పెట్టుబడిదారుల లాభాలు విపరీతంగా పెరుగుతున్నాయని నాయుకులు విమర్శించారు. ఇదే విషయం అనేక సంస్థల అధ్యయనంలో తేలిందన్నారు. కరోనా సమయంలోనే కార్మిక చట్టాలను కార్పొరేట్​ రంగాలకు అనుకూలంగా లేబర్​కోడ్​లను మార్చేశారని కార్మిక నాయకులు విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details