- CHANDRABABU: 'ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు'
తెదేపా నేతలపై అక్రమ కేసులు పెడుతూ జగన్ రెడ్డి ఉన్మాదిలా పైశాచిక ఆనందం పొందుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రెండేళ్లుగా ప్రభుత్వం తెదేపా నేతల్ని వేధిస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Gorantla Meet CBN: చంద్రబాబుతో గోరంట్ల బుచ్చయ్య భేటీ
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ భవన్లో అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలో అంతర్గత పరిస్థితిపై గోరంట్ల ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యనేతల సంప్రదింపులతో బుచ్చయ్య అధిష్టానం వద్దకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- WEATHER UPDATE: ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలు..!
ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ అంశంపై విజయమ్మ, షర్మిల ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టాలి'
ఒక్క ఛాన్స్ ప్రణాళికలో భాగంగా ప్రజల్ని మోసగించేందుకు జగన్, విజయమ్మ, షర్మిల ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా పోషించారని తెదేపా నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానమూ అమలు కావట్లేదని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్లడ్ బ్యాంకు నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ
బ్లడ్ బ్యాంకు, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారికి హెచ్ఐవీ సోకింది. ఇదే విషయంపై రాష్ట్ర వైద్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బైడెన్‌ను కాపాడిన వ్యక్తిని అఫ్గాన్‌లోనే వదిలేసిన అమెరికా!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(biden news).. సెనేటర్‌గా ఉన్న రోజుల్లో ఓసారి అఫ్గాన్ పర్యటనకు వెళ్లారు. ప్రతికూల పర్యటనల కారణంగా ఆయన హెలికాప్టర్‌ను మారుమూల గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Bagram air base: బగ్రామ్ ఎయిర్‌బేస్‌పై చైనా కన్ను!
అప్గానిస్థాన్(Afghanistan) నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయిన క్రమంలో రెండు దశాబ్దాల పాటు ఉగ్రవాద నిర్మూలన కోసం అమెరికా ప్రధాన కేంద్రంగా చేసుకున్న బగ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌ను(Bagram air base) స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని హెచ్చరించారు ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్‌పై భారత్ చారిత్రక విజయం.. ఏనుగు, గుర్రమే కారణం!
భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు ఓవల్ వేదికగా జరుగుతోంది. ఇదే మైదానంలో టీమ్ఇండియా 50 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ గడ్డపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ విజయంలో ఏనుగు, గుర్రం కూడా భాగమయ్యాయట. అదెలాగో తెలుసా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హరీశ్-పవన్ మూవీ పోస్టర్ కేక
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్(harish shankar pawan kalyan new movie) దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇవాళ(సెప్టెంబరు 2) పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవన్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధానవార్తలు @5PM