Three died in road accident: కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని... బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు. విశాఖ నుంచి కోరుకొండ మండలం శ్రీరంగ పట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులు, గాయపడినవారంతా శ్రీరంగ పట్నం వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కళాకారులు. నాటక బృందం విశాఖ మార్కాపురం వద్ద నిన్న రాత్రి నాటకం ప్రదర్శించారు. నాటక ప్రదర్శన అనంతరం తిరిగి వస్తుండగా... ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Road accident: ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి.. ఎక్కడంటే..? - కాకినాడ జిల్లా నేర వార్తలు
Three died in road accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే..?
ఘోర రోడ్డు ప్రమాదం
Last Updated : Sep 15, 2022, 9:21 AM IST