ముఖ్యమంత్రి జగన్ మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన సంఘటన్ పర్వ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పెర్కొన్నారు.
'ఆరు నెలల సమయమిస్తున్నాం..'
ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను సరిచేసుకోవడానికి ఆరు నెలల సమియస్తున్నామన్నారు. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజన్న పాలన తెస్తానన్నారు కానీ ప్రస్తుతం పోలీసు పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పునరుద్ఘాటించారు. హోదా సాధ్యం కానందువల్లే ఏపీకి రెండింతలు మేలు కలిగేలా ప్యాకేజీ ప్రకటించామని చెప్పారు.