తూర్పుగోదావరి జిల్లాలో బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడుతున్న నలుగురిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడకు చెందిన 17 ఏళ్ల యువకుడు.. చెడు వ్యసనాలకు బానిసై, చోరీలకు పాల్పడేవాడు. దీంతో ఆ మైనర్ పై 42 కేసులు నమోదై ... 10 సార్లు జువైనల్ హోమ్ లో ఉండి.. 2020 డిసెంబర్ లో విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా ఆ యువకుడు మరో ముగ్గురితో కలిసి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు... నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 248 గ్రాముల బంగారం, 28 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.
బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడుతున్న నలుగురి అరెస్టు
అతని వయస్సు17 సంవత్సరాలు. ఇప్పటివరకు నమోదైన కేసులు 42. జువైనల్ హోమ్‌లో ఉన్నది 10 సార్లు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేయడంతో ఇన్ని కేసులు నమోదయ్యాయి. ఇంత జరిగినా స్నేహితులతో కలిసి మళ్లీ దొంగతనాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పోలీసులకు చిక్కాడు ఆ యువకుడు.
కొత్తపేటలో దొంగలముఠా అరెస్టు