ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 7764 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక పోలింగ్ కేంద్రం... ఏలూరులో మాత్రం రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. కుక్కునూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లలో మాత్రం మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. జిల్లాలోని అన్ని బ్యాలెట్ పెట్టెలను సాయంత్రానికి కాకినాడకు తరలిస్తామని అధికారులు తెలిపారు.
ఉభయగోదావరి జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం - ఉభయగోదావరి జిల్లాల టీచర్ల ఎమ్యెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. ఉభయ జిల్లాల పరిధిలో 49 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఉభయగోదావరి జిల్లాల టీచర్ల ఎమ్యెల్సీ ఎన్నికలు