కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చరిత్ర మొత్తం అవినీతిమయమని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ద్వారంపూడి అరాచకాలు, నేరచరిత్రపై పుస్తకమే రాయొచ్చని ఆమె అన్నారు. 2004 నుంచి ద్వారంపూడిపై దొమ్మీ, హత్యాయత్నం కేసులు లెక్కనేనన్ని ఉన్నాయని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కాలిగోటికి సరిపోని ద్వారంపూడి... ఆయనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రానికి జగన్ అనే చీడ పట్టిందన్న అనూరాధ... అది వదిలినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.
'ఆ ఎమ్మెల్యే నేరచరిత్రపై పుస్తకమే రాయొచ్చు' - పంచుమర్తి అనురాధ వార్తలు
వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడిపై తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన నేర చరిత్రపై ఓ పుస్తకమే రాయొచ్చని అన్నారు. చంద్రబాబు కాలిగోటికి ద్వారంపూడి సరిపోరని ఎద్దేవా చేశారు.
!['ఆ ఎమ్మెల్యే నేరచరిత్రపై పుస్తకమే రాయొచ్చు' tdp spokes person panchamurthi anuradha fires on kakinada mla dwarampudi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5742560-463-5742560-1579257130159.jpg)
tdp spokes person panchamurthi anuradha fires on kakinada mla dwarampudi
మీడియా సమావేశంలో పంచుమర్తి అనురాధ