ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం దర్యాప్తు జరపాలి: యనమల - కాకినాడ సెజ్ కొనుగోళ్లపై యనమల వ్యాఖ్యలు

కాకినాడ సెజ్ కొనుగోళ్లపై త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. దానిపై కేంద్రం స్పందించి కొత్త బినామీ చట్టం ప్రకారం దర్యాప్తు జరపాలని కోరారు. బినామీ లావాదావీలపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు.

yanamala ramakrishnudu
యనమల రామకృష్ణుడు, తెదేపా నేత

By

Published : Oct 4, 2020, 12:04 PM IST

కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం తక్షణమే స్పందించి కొత్త బినామీ చట్టం ప్రకారం దర్యాప్తు జరపాలని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. బినామీ లావాదేవీలపై త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాకినాడ సెజ్ కొనుగోళ్ల బినామీ లావాదేవీలపై సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలన్నారు. జగన్‌కు సంబంధం లేకుంటే రైతులకు పరిహారం ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. ఎకరానికి రూ.10లక్షల చొప్పున 10వేల ఎకరాల రైతులకు అదనపు పరిహారం కింద వెయ్యి కోట్లు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

బల్క్ డ్రగ్ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయడంపై స్థానికుల్లో వ్యతిరేకత ఉన్నందున పరిశ్రమ ఏర్పాటు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాలుష్య సమస్యతో పాటు మత్స్యకారులు అనేకమంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు ప్రత్యేక ఆర్ధిక సాయం అందించాలని కోరారు. ఇక్కడ నెలకొల్పే పోర్టుకు మత్స్యకారుల వేటకు వీలుగా జెట్టీలు ఏర్పాటు చేయాలన్నారు. హేచరీస్​పై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు. అరబిందో ఇన్ ఫ్రా ఆదాయంలో స్థానికులకు వాటా ఇవ్వాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details