ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం - suicide attempt
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపంతో కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట ఓ మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. భర్త లోవ రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల సహకారంతో పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.