కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. ఐడియల్ విద్యాసంస్థ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. బారికేడ్లను తొలగించి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం మూసివేసి విద్యార్థులను అడ్డుకున్నారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వర్షంలోనే విద్యార్థులు ఆందోళన కొనసాగించారు.