Special prayers for Good Friday: పార్వతీపురం మన్యం జిల్లాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని బాలుర ఆర్సీఎం చర్చిలో క్రీస్తుకు సిలువ వేసిన ఘట్టాలు ప్రదర్శించారు. శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని ప్రభువు సూచించారని.. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని మత పెద్దలు సూచించారు. బైబిల్లోని ప్రధాన అంశాలను మత పెద్దలు భక్తులకు వివరించారు.
Prayers for Good Friday: రాష్ట్రవ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు - ఏపీ తాజా వార్తలు
Special prayers for Good Friday: "గుడ్ ఫ్రైడే" సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ భక్తులు.. క్రీస్తును స్మరించుకున్నారు. పార్వతీపురంలోని బాలుర ఆర్సీఎం చర్చిలో క్రీస్తుకి సిలువ వేసిన ఘట్టాలు ప్రదర్శించారు. శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని ప్రభువు సూచించారని.. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని మత పెద్దలు బోధించారు. కాకినాడ జిల్లా యానాంలో అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే ప్రార్ధనలు
వైఎస్ఆర్, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ క్రైస్తవులు.. గుడ్ ఫ్రైడేను ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు బహిరంగ శిలువ మార్గపు ర్యాలీ చేశారు. లోక సంరక్షణార్థం ప్రార్థనలు నిర్వహిస్తూ, ఏసు శిలువను మోస్తూ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Good Friday: 'శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలన్న దయామయుడు ఏసుక్రీస్తు'
Last Updated : Apr 15, 2022, 5:27 PM IST