ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Somu Veerraju: 'రాష్ట్రంలో అభివృద్ధి మోదీది.. అవినీతి జగన్​ది' - రాష్ట్రంలో అభివృద్ధి మోదీది..అవినీతి జగన్​ది

రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం కేంద్రం వేల కోట్ల నిధులు విడుదల చేస్తుంటే.. ప్రచారం మాత్రం ముఖ్యమంత్రి జగన్ చేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి మోదీదైతే.. అవినీతి జగన్​దని వ్యాఖ్యానించారు.

'రాష్ట్రంలో అభివృద్ధి మోదీది..అవినీతి జగన్​ది'
'రాష్ట్రంలో అభివృద్ధి మోదీది..అవినీతి జగన్​ది'

By

Published : Aug 28, 2021, 8:52 PM IST

రాష్ట్రంలో అభివృద్ధి మోదీదైతే.. అవినీతి జగన్​దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం కేంద్రం వేల కోట్ల నిధులు విడుదల చేస్తుంటే.. ప్రచారం మాత్రం ముఖ్యమంత్రి జగన్ చేసుకుంటున్నారని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన సంక్షేమ పథకాల నిధులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కాకినాడలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పేదల ఇళ్ల కోసం కొనుగోలు చేసిన భూముల్లో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని ఆరోపించారు.

లే అవుట్లలో మట్టిని నింపేందుకు కొండలు, గుట్టలు తొలిచేస్తున్నారన్నారు. పేదల ఇళ్లకు జగన్ ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేస్తే.. కేంద్రమే లక్షా యాభై వేల రూపాయలు ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించదనే భయంతో రహదారుల మరమ్మతుల నిర్వహణకు గుత్తేదారులు ముందుకు రావటం లేదని ఆక్షేపించారు. వైకాపా నేతలు గనులను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details