ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'క్రీడా రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ'

ఏ రంగానికైనా కొంత పరిధి ఉంటుందని.. కాని క్రీడా రంగానికి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ నిధులతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్మించిన ఉడెన్‌ షటిల్‌ కోర్టు, బోట్‌ యార్డును ఆయన ప్రారంభించారు.

shuttle court and boat yard open at ysr indoor stadium Kakinada
క్రీడా రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది

By

Published : Nov 3, 2020, 6:40 PM IST

రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతోపాటు క్రీడాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజల ఆంకాక్షకు అనుగుణంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషిచేస్తూ.. ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్మార్ట్‌ సిటీ నిధులు రూ.2.90 కోట్లతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం ఉడెన్‌ షటిల్‌ కోర్టు, రూ.7 కోట్లతో నిర్మించిన బోట్‌ యార్డును ఆయన ప్రారంభించారు.

క్రీడా రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది

ఏ రంగానికైనా కొంత పరిధి ఉంటుందని.. కాని క్రీడా రంగానికి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుందన్నారు. క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, విశ్వరూప్‌, వేణు ఎంపీ వంగ గీత, సిటీ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details