తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. కాకినాడ గ్రామీణ మండలం రమణయ్యపేట సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న 32 ఏళ్ల లక్ష్మి.. 7 నెలల గర్భిణి. కరోనా సోకి 9 రోజులపాటు మహమ్మారితో పోరాడి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
కొవిడ్‌కు గర్భిణి బలి.. ఆక్సిజన్ అందట్లేదని అంతకుముందు సెల్ఫీవీడియో! - కాకినాడ జీజీహెచ్‌లో కరోనాతో గర్భిణీ మృతి న్యూస్
కొవిడ్ ధాటికి బలై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తునే ఉన్నాయి. పడకలు, ఆక్సిజన్ కొరతతో మరణిస్తున్న దయనీయ గాథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తునే ఉన్నాయి. అలాంటి ఘటనే కాకినాడలో జరిగింది. కరోనా కారణంగా గర్భిణి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సమస్యను తెలియజేసేలా.. ఆ గర్భిణి మరణానికి 2 రోజుల క్రితం తీసుకున్న సెల్ఫీ వీడియో.. మనసును కలచివేస్తోంది.
pregnant died with corona in kakinada ggh
జీజీహెచ్‌లో సరిగా చికిత్స అందడం లేదని రెండు రోజుల క్రితం ఆమె సెల్ఫీ వీడియో తీశారు. ఆక్సిజన్ అందక ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని తెలిపారు. చివరి క్షణాల్లో ఆమె ఊపిరి ఎంతో కష్టంగా తీసుకున్న దృశ్యాలు.. మనసుని కలిచేవేస్తున్నాయి.
ఇదీ చదవండి:'రోజూ గోమూత్రం తాగితే కొవిడ్ నుంచి రక్ష'