ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'12న కాకినాడలో పవన్ కల్యాణ్ నిరసన దీక్ష' - కాకినాడలో పవన్ దీక్ష

కాకినాడలో పవన్ ఒక్కరోజు నిరసన దీక్ష ఖరారైంది. 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దీనిని నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Pawan Deeksha in Kakinada on the 12th of this month
రైతులతో పవన్ కల్యాణ్(పాతచిత్రం)

By

Published : Dec 9, 2019, 9:33 PM IST

వివరాలు వెల్లడిస్తున్న నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో రైతులకు అండగా నిలబడేందుకు ఈనెల 12వ తేదీన కాకినాడలో పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టనున్నట్లు జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీనిని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన కోరారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్​లో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల రైతులు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఇప్పటికే మండపేటలో పర్యటించిన పవన్... ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకల విషయం గుర్తించారన్నారు. అందుకే రైతులకు బాసటగా నిలించేందుకు ఒక రోజు నిరసన దీక్ష చేయనున్నట్లు మనోహర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details